పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ జిల్లా శివాపురం వద్ద బొప్పాయి పండ్ల లోడుతో వెళుతోన్న బొలేరో వాహనం, లారీ ఢీ కొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన వారు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం, గడ్డమీదపల్లెకు చెందిన కూలీలుగా గుర్తించారు.
ప్రమాద విషయం తెలియగానే మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.