ఉగ్రవాదుల పీచమణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు తిరంగా యాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి పదకొండు రోజుల పాటు మే 23 వరకు దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరంగా యాత్ర జరపాలని నిర్ణయించారు. సోమవారం రెండు విడతలు సమావేశమైన సీనియర్ నేతలు తిరంగా యాత్రపై చర్చించారు. తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుశ్వంత్ గౌతమ్ కూడా ఈ సమావేశంలో నడ్డాతో చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు సహా, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరంగా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.