పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను మూసి వేసిన సంగతి తెలసిందే. మే7న భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా విమానాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేశారు. మే 15 వరకు విమానాశ్రయాలు మూసి వేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే 10వ తేదీ సాయంత్రం కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. గడచిన 24 గంటలుగా సరిహద్దుల వెంట ఎలాంటి కాల్పులు లేవని సైన్యం తెలిపింది. దీంతో మూసివేసిన 32 విమానాశ్రయాలు వెంటనే తెరుస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
మూసి వేసిన విమానాశ్రయాలు నేటి నుంచే పని చేయడం ప్రారంభిస్తాయి. వివరాలు కావాల్సిన వారు ఆయా సంస్థల వెబ్‌సైట్లు పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పలు విమానాశ్రయాలకు సర్వీసులు పునరుద్దరించారు. సాయంత్రానికి అన్ని ప్రధాన విమానాశ్రయాలకు విమానాలు నడపనున్నారు.