వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోలీసుల విచారణ హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా హెలికాఫ్టర్ వద్ద చోటు చేసుకున్న తోపులాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.జగన్మోహన్రెడ్డి హెలికాఫ్టర్ దిగకముందే జనం పెద్ద ఎత్తున తోసుకువచ్చారు. కొందరు పోలీసులపై రాళ్లు విసిరారు. పోలీసులు గాయపడ్డారు. జగన్మోహన్రెడ్డి భద్రతపై పోలీసుల సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గాలికొదిలేశారు. తొపుదుర్తి స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టి భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.