ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల కిందట జైలు నుంచి తప్పించుకు పారిపోయిన కాశ్మీర్‌సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు బిహార్‌లోని మోతిహరి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న కశ్మీర్‌సింగ్‌ను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. స్థానికుల సహకారంతో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కశ్మీర్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇతనికి వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు,డ్రగ్స్ రవాణాలతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
2016లో జైలులో ఖలిస్థానీ ఉగ్రవాదులతో కలసి ఘర్షణకు దిగిన కశ్మీర్ సింగ్ ఆయుధాలతో సహా పారిపోయాడు. అతనితోపాటు వందల మంది నేరస్థులు అప్పట్లో పారిపోయిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తరవాత ఎన్ఐఏ అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు.
జైలు నుంచి పారిపోయిన కశ్మీర్‌సింగ్ ఉగ్రవాదులు బబ్బర్ ఖల్సా, హర్వీందర్ సింగ్ సంధుతో కలసి పనిచేశాడు. వారికి అవసరమైనవి సమకూర్చడం పనిగా పెట్టుకున్నాడు. మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి ఘటనల్లోనూ కశ్మీర్ సింగ్ పాల్గొన్నాడని తెలుస్తోంది.
2022లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. బబ్బర్ ఖల్సా, ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ సంస్థలతో కశ్మీర్ సింగ్‌కు సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేయడం, భారత్‌లో దాడులకు కుట్రలు పన్నడం వంటి నేరాలు ఇతనిపై ఉన్నాయి. ఎన్ఐఏ కేసు నమోదు చేసిన తరవాత కశ్మీర్ సింగ్‌ను పట్టిస్తే పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు.