పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల వెంట నెలకొన్న ఘర్షణకు తెరపడింది. గడచిన 24 గంటల్లో పాక్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేవని భారత సైన్యం ప్రకటించింది. మోర్టార్ల శబ్దం నిలిచిపోయింది. శనివారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే పాక్ సైన్యం డోన్లతో దాడికి యత్నించింది. పాక్ దాడులను సైన్యం తిప్పికొట్టింది. దాదాది దేశం అరాచకాలను ప్రపంచానికి ఆధారాలతో సహా భారత సైన్యం పట్టించింది. మరోసారి దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించడంతో పాక్ తోక ముడిచింది. గడచిన 24 గంటలుగా ఎలాంటి కాల్పులు లేవని భారత సైన్యం వెల్లడించింది.
ఏప్రిల్ 22న బైసరన్‌లో ఉగ్రదాడి జరిగిన తరవాత నుంచి సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉగ్రమూకల ఏరివేతలో భాగంగా భారత్ ఏప్రిల్7న పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడికి దిగింది. 100 మందికిపైగా ఉగ్రవాదులను ఏరివేశారు. తరువాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్‌లోని 9 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకువచ్చింది. ఇందుకు భారత్ అంగీకరించడంతో సరిహద్దుల వెంట కాల్పులు నిలిచిపోయాయి.