తమిళ నటుడు విశాల్ ఓ కార్యక్రమ వేడుకల్లో కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా కువాంగంలోని కూర్తాండవర్ ఆలయంలో నిర్వహిస్తోన్న చిత్తిరై వేడుకల్లో విశాల్ పడిపోయారు. ట్రాన్స్‌జెండర్ల మిస్ కువాంగం 2025 కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపైనే ఆయన కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన మద గజ రాజా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విశాల్ చాలా నీరసంగా కనిపించారు. అప్పడే ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని అందుకే అలా ఉన్నారంటూ విశాల్ టీం ప్రకటించింది.