ఆపరేషన్ సిందూర్ విజయాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత సంకల్పానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ఆయన అన్నారు. భారత సైన్యం పాక్ ఆర్మీ ప్రధాన కేంద్రం రావల్పిండిపై దాడిచేసి పరాక్రమాన్ని ప్రదర్శిందని కొనియాడారు.
ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాన్ని రక్షణ మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. భారత సైన్యం ఉగ్రశక్తులను దీటుగా ఎదుర్కొటొందన్నారు. ఆపరేషన్ సిందూర్ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిందని చెప్పారు. పహల్గాం బాధితులకు న్యాయం జరిగిందన్నారు. భారత సైన్యం పాక్ ప్రజలపై దాడి చేయలేదని, కాని పాకిస్థాన్ సైన్యం పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడిందని ధ్వజమెత్తారు.