భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ తరవాత నెలకొన్న పరిస్థితులపై రెండు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి. హాట్‌లైన్ ద్వారా జరిగే చర్చల్లో ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ పాల్గొంటారు. కాల్పుల విరమణ ఒప్పందం, కొనసాగింపు ఉద్రిక్తతలు తగ్గించడం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
కాల్పుల విమరణ అమల్లోకి వచ్చాక శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్ ద్వారా మాట్లాడారు. కాల్పుల విరమణ వెంటనే అమలు చేద్దామని కోరారు. దీంతో సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. కాల్పుల విమరణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే డ్రోన్ దాడులకు దిగి పాక్ వక్రబుద్ధి చాటుకుంది.