పాక్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని ప్రకటించింది. తమకు అప్పగించిన పనిని అత్యంత కచ్ఛితత్వంతో పూర్తి చేసినట్లు వాయుసేన తెలిపింది. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆపరేషన్ కొనసాగుతోందని, అధికారికంగా వివరాలు అందిస్తామని వాయుసేన ప్రకటించింది. తప్పుడు సమాచారానికి మీడియా దూరంగా ఉండాలని వాయుసేన ఎక్స్‌లో పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణ ప్రతిపాదనల నేపథ్యంలో నిలిచిపోతుందని అందరూ భావించారు. అయితే పాక్ గత రాత్రి డ్రోన్లతో దాడులకు దిగడంతో వాయుసేక కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ పురోగతి సాధించిన తరవాత భారత ప్రభుత్వం తదుపరి చర్యలపై స్పష్టత నిస్తుందని తెలుస్తోంది.