సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్‌కు మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. శనివారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయం నుంచి మురళీ నాయక్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. వీరమరణం పొందిన మురళీనాయక్ భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. సమీప గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.
మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ పార్థ సారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు ప్రముఖులు మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యారు.