కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యలను యుద్ధచర్యలుగా పరిగణిస్తామంటూ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఉగ్రచర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం ద్వారా జరిగే దాడులను యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ అధిపతి అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దు ప్రాంతాలపై పాక్ సైన్యం డ్రోన్లు,క్షిపణులు, మోర్టార్లతో విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. సాధారణ పౌరులే లక్ష్యంగా చెలరేగిపోతోంది. పాక్ దాడులు కొనసాగిస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాలని కేంద్రం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.