పాక్ సైన్యం మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. అర్థరాత్రి సరిహద్దుల వెంట 26 ప్రదేశాల్లో డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు దిగింది. దీంతో భారత వాయుసేన పాక్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌధురి ధ్రువీకరించారు.
పాక్ సైనిక రాజధాని రావల్పిండిపై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి. చక్లాలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్‌లోని రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామంటూ పాక్ సైన్యం హెచ్చరించింది. పాక్ దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉ్ మర్సూస్ అంటూ నామకరణం చేశారు.
ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో పగటి పూట కొంత ప్రశాంతంగా ఉన్నా అర్థరాత్రి దాటాక కాల్పుల మోత మోగుతోది. భారత్‌లోని బారీముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. భారత సైన్యం తిప్పికొట్టింది. తాజాగా శనివారం తెల్లవారుజామున పాక్ సరిహద్దుల వెంట భారీగా కాల్పులకు తెగబడింది.