ఏపీ నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి అబుదాబికి నేరుగా విమాన సర్వీలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే భువనేశ్వర్ నుంచి విశాఖ, విజయవాడ నుంచి బెంగళూరు సర్వీసులు కూడా వచ్చే నెల నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరావు రాంమ్మోహన్‌నాయుడు ప్రకటించారు.
జూన్ 13 నుంచి విశాఖ నుంచి అబుదాబికి విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. వారానికి 4 రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక జూన్ 12 నుంచి భువనేశ్వర్ విశాఖ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఐటీ రాజధాని బెంగళూరుకు అమరావతిని అనుసంధానం చేసేందుకు జూన్ 2 నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానాలు నడపనున్నారు. అమరావతి రాజధానికి రాకపోకలు సులభతరం చేసేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.