ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా వేశారు. భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వారం పాటు నిలిపివేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు.
పంజాబ్, దిల్లీ మ్యాచ్ భద్రతా కారణాల వల్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. నేడు లక్నో ఆర్సీబీ మధ్య ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. నేటి నుంచి మ్యాచ్‌లు వారం వాయిదా వేయడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. ఈ సీజన్‌లో ఇంకా 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే25న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 16, బెంగళూరు 16, పంజాబ్ 15,ముంబై 14తో అగ్రస్థానంలో ఉన్నాయి.
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. ధర్మశాలలోని ఆటగాళ్లను ఢిల్లీకి తరలించారు.ముందుగా ఆటగాళ్ల కోసం వందేభారత్ రైలు ఏర్పాటు చేశారు. అది పఠాన్‌కోట్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే భద్రత దృష్ట్యా రైల్వే శాఖ అనుమతి లభించలేదు. ఆటగాళ్లను తరలిచేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.