Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

Phaneendra by Phaneendra
May 9, 2025, 12:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర గురువారం సాయంత్రం నుంచీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. కొన్నేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ కాల్పులు, దాడులు చోటు చేసుకున్నాయి. పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా భారతదేశం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అయితే దాన్ని తమ దేశంపైనే దాడిగా చెప్పుకుంటూ పాకిస్తాన్ భారత సరిహద్దులపై దాడులు మొదలుపెట్టింది. ఆ దాడుల్లోనూ పాకిస్తాన్‌కు పరాభవం తప్పలేదు. ఆ దేశం ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్లను భారతదేశం తుత్తునియలు చేసింది. ఏ కోణం నుంచి చూసినా తమకే దెబ్బలు తగులుతుండడంతో పాకిస్తాన్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మొదలు పెట్టింది.

మే 8 గురువారం రాత్రి సుమారు 8.30 గంటల సమయం నుంచీ పాకిస్తాన్ గగనతల దాడులు మొదలయ్యాయి. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లోని భారతదేశపు మిలటరీ స్థావరాల మీద పాకిస్తాన్ దాడులు ప్రారంభించింది. ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్, కామికాజ్ డ్రోన్స్, అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్‌ను ప్రయోగించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటన్నింటినీ భారతదేశం సమర్ధంగా అడ్డుకుంది. క్షిపణులను, డ్రోన్స్‌ను, ఏరియల్ సిస్టమ్స్‌ను కుప్పకూల్చింది. ఒక పాకిస్తానీ పైలట్ కూడా భారత బలగాల చేతికి చిక్కాడు.

 

పాకిస్తాన్ తప్పుడు ప్రచారం:

భూమ్యుపరితలం నుంచి గగన మార్గం ద్వారా దాడులు ఒకవైపు చేస్తూనే, పాకిస్తాన్ మరోవైపు నుంచి ఆన్‌లైన్ దాడులు కూడా ప్రారంభించింది. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయసాగింది. భారత ప్రభుత్వపు అధికారిక ఫ్యాక్ట్‌చెక్ విభాగం అలాంటి సమాచారపు నిగ్గు తేల్చేసింది. వాటిలో చాలావరకూ పాకిస్తానీ హ్యాండిల్స్‌ నుంచి మొదలైనవే. భారతీయులు కూడా చాలామంది వాటిని తెలిసో తెలియకుండానో షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు.

మే 8 రాత్రి 10 గంటల నుంచి మే 9 ఉదయం 6.30 గంటల లోపు కనీసం 8 ప్రధానమైన తప్పుడు ప్రచారపు సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ కనుగొంది. తప్పుడు వీడియోలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అప్రమత్తం చేసింది. ప్రస్తుత ఘర్షణలకు సంబంధం లేనివి, లేదా కృత్రిమంగా మార్చినవి, లేదా పూర్తిగా కల్పించినవీ అనే మూడు రకాలుగా వాటిని వర్గీకరించింది.

 

తప్పుడు ప్రచారం 1: జలంధర్‌పై డ్రోన్ దాడి:

భారతదేశపు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌ నగరంపై డ్రోన్ దాడి జరిగిందంటూ ఒక వీడియో విస్తృతంగా ప్రచారం అయింది.  ఆ వీడియో నిజానికి ఒక పొలంలో మంట పెట్టిన వీడియో. ఆ ప్రాంతపు గగనతలంలో అసలు ఎలాంటి చర్యలూ చోట చేసుకోనే లేదు. ఆ వీడియోలోని దృశ్యాలకు, మిలటరీ చర్యతో ఎలాంటి సంబంధమూ లేదని జలంధర్ డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. ఆ వీడియోను పాకిస్తాన్ దాడిగా భ్రమించి సర్క్యులేట్ చేయవద్దంటూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ దేశ ప్రజలను హెచ్చరించింది.

 

తప్పుడు ప్రచారం 2: భారత సైనిక పోస్ట్ ధ్వంసం:

పాకిస్తాన్ దాడిలో భారత సైన్యానికి చెందిన 20 రాజ్ బెటాలియన్ దళానికి చెందిన ఆర్మీ పోస్ట్ ధ్వంసం అయిందంటూ ఒక వీడియో ప్రచారం అవుతోంది. ఏకంగా 50మందికి పైగా భారత సైనికులు హతమయ్యారంటూ ఆ వీడియోలో చెప్పారు. నిజానికి అది నకిలీ వీడియో అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ స్పష్టం చేసింది. అసలు భారత సైన్యంలో ‘20 రాజ్ బెటాలియన్’ అనే విభాగమే లేదని వెల్లడించింది. కేవలం దుష్ప్రచారం కోసమే ఆ ఫేక్ వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నారని ధ్రువీకరించింది.

 

తప్పుడు ప్రచారం 3: భారత్‌పై క్షిపణి దాడి:

భారతదేశం చేసిన దాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్ భారత్‌ మీద క్షిపణి దాడులు చేస్తోందంటూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసారు. నిజానికి అది పాత వీడియో. 2020లో లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. వాటిని, ఇప్పుడు పాకిస్తాన్ దాడిలో భారతదేశంలో జరిగిన విధ్వంసంగా చూపిస్తూ ఆ వీడియోను చెలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఆ వీడియో జనాలను పక్కదోవ పట్టించడానికి వాడుతున్నారని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది.  

 

తప్పుడు ప్రచారం 4: రాజౌరీలో ఆత్మాహుతి దాడి:

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో భారతదేశపు సైనిక బ్రిగేడ్ మీద ఆత్మాహుతి దాడి జరిగిందంటూ పుకార్లు వ్యాపింపజేసారు. దానికోసం ఒక వీడియోను వైరల్ చేరసారు. నిజానికి అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని పీఐబీ ధ్రువీకరించింది. ఆ వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని స్పష్టం చేసింది. భారతదేశంలో ఏ ఆర్మీ కంటోన్మెంట్ మీదా ఎలాంటి ఆత్మాహుతి దాడీ జరగలేదని స్పష్టం చేసింది. భారతీయులను అయోమయం కలిగించి వారిని కన్‌ఫ్యూజ్ చేయడానికి అటువంటి అబద్ధపు సమాచారాన్ని విశ్వసించవద్దంటూ పిలుపునిచ్చింది.

 

తప్పుడు ప్రచారం 5: ఆర్మీచీఫ్ పేరిట నకిలీ లేఖ:

భారతదేశపు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ వి.కె నారాయణ్ పేరిట ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. భారత సైన్యంలోని నార్తరన్ కమాండ్ అధికారికి యుద్ధ సన్నద్ధత పేరిట రాసినట్టుగా ఆ ఉత్తరం ఉంది. అయితే నిజానికి ఆ లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ నిర్ధారించింది. వి.కె నారాయణ్ అనే వ్యక్తి భారతదేశపు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కాదని స్పష్టం చేసింది. ధ్రువీకరణ లేని అటువంటి సమాచారాన్ని విశ్వసించవద్దనీ, భారత ప్రభుత్వం అధికారిక మార్గాల ద్వారా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనీ స్పష్టం చేసింది. నిజానికి ప్రస్తుతం భారతదేశ సైన్యానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నది జనరల్ ఉపేంద్ర ద్వివేదీ. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ నేటివరకూ ఎప్పుడూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా వి.కె నారాయణ్ అనే అధికారే లేరు. దాన్ని బట్టే ఆ లేఖ నకిలీదని ఇట్టే అర్ధమైపోతోంది.

 

తప్పుడు ప్రచారం 6: అమృత్‌సర్‌ మీద అంబాలా ఎయిర్‌బేస్‌ నుంచి దాడి:

భారతదేశం, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ మీద దాడి చేసిందనీ, తమ సొంత ప్రజల మీదనే దాడికి పాల్పడిందనీ ఒక సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. హసన్ రజా అనే పాకిస్తానీ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆ పోస్ట్… అంబాలాలోని ఎయిర్‌బేస్ నుంచి అమృత్‌సర్ నగరం మీద దాడి చేసినట్లుగా చెబుతోంది. అది నిరాధారమైన పూర్తి స్థాయి తప్పుడు సమాచారం అని పీఐబీ స్పష్టం చేసింది. దురుద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలోనే ఆ పోస్ట్ పెట్టారని వెల్లడించింది. అందులోని సమాచారం యావత్తూ తప్పేనని వివరించింది.

 

తప్పుడు ప్రచారం 7: విమానాశ్రయాల్లోకి ప్రవేశం నిషిద్ధం:

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించిందంటూ సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్‌లు పెడుతున్నారు.  అది పూర్తిగా తప్పుడు సమాచారం అని పీఐబీ వెల్లడించింది. భారత ప్రభుత్వం అటువంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.

 

తప్పుడు ప్రచారం 8: గుజరాత్‌లోని హజీరా పోర్ట్ మీద దాడి:

గుజరాత్ రాష్ట్రంలోని హజీరా ఓడరేవు మీద దాడి జరిగిందంటూ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒక వీడియో విపరీతంగా ప్రచారం అయ్యింది. నిజానికి ఆ వీడియో, ప్రస్తుతం భారత పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినది కాదని పీఐబీ తేల్చింది. ఆ వీడియో 2021 జులై 7నాటిదనీ, ఒక ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన దృశ్యమనీ నిర్ధారించింది. దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ దాడిలో గుజరాత్‌లోని ఓడరేవు ధ్వంసమైనట్లు ప్రచారం చేస్తున్నారని వివరించి చెప్పింది.

 

అలా, పాకిస్తాన్ భారతదేశం మీద సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంలోని నిజానిజాలను పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ నిగ్గు తేలుస్తోంది. మరోవైపు, కొంతమంది ఔత్సాహికులైన భారతీయ పౌరులు దురుద్దేశపూర్వకంగానో లేక ఏ ఉద్దేశమూ లేకుండానో అలాంటి సమాచారాన్ని పంచుకుంటున్నారనీ, అలా చేయకుండా సంయమనం పాటించాలనీ భారత ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది.

Tags: Disinformation CampaignFake NewsPakistanPIB Fact CheckTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.