ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. గురువారం రాత్రి సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం అడ్డుకుంది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్‌లో ఉగ్రవాదుల కుట్రను ఆర్మీ భగ్నం చేసింది. గురువారం అర్థరాత్రి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటుకుని భారత్‌లోకి చొరబడే ప్రయత్నాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
సరిహద్దుల వెంట భారీగా కాల్పులకు తెగబడిన పాకిస్తాన్, ఇదేసమయంలో ఉగ్రమూకలను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత సైన్యం పాక్ దళాలకు ధీటుగా బదులిస్తున్నాయి. సరిహద్దుల వెంట నిఘాను పెంచాయి. సరిహద్దులను సీజ్ చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కాల్చివేయాలని ఆదేశాలు అందడంతో భారత సైనికులు గత రాత్రి ఏడుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.
పాకిస్థాన్ సరిహద్దుల వెంట భారీగా కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు త్రివిధ దళాలు ప్రకటించాయి. గత రాత్రి పాకిస్థాన్‌లోని కరాచీపై విక్రాంత్ యుద్ధ నౌక నుంచి 80కుపైగా మిసైల్స్ ప్రయోగించారు. కరాచీ ఓడరేవులో భారీ విధ్వంసం సృష్టించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.