పాక్‌పై భారత సైన్యం మరోసారి విరుచుకుపడింది. గత రాత్రి భారత్ లక్ష్యంగా చైనాకు చెందిన హెచ్‌క్యూ 9 రక్షణ వ్యవస్థ ద్వారా మిసైల్స్,డ్రోన్లలో పాక్ దాడికి యత్నించింది.
దీంతో భారత సైన్యం లాహోర్‌లో పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది.
పఠాన్ కోట్, అమృత్‌సర్, శ్రీనగర్, భుజ్, జలంధర్, కపుర్తలా, చండీగఢ్, నాల్, భరిండాలపై పాక్ క్షిపణి దాడులకు తీవ్రంగా ప్రయత్నించింది. పాక్ దాడులను భారత సైన్యం తప్పికొట్టింది.
పాక్ దాడులకు ప్రతిగా భారత్ ఇవాళ ఉదయం లాహోర్‌లో హెచ్‌క్యూ 9 రక్షణ వ్వవస్థను ధ్వంసం చేసింది.పాకిస్థాన్ భారత్ లక్షంగా దాడులకు దిగడంతో సైన్యం చర్యలు ప్రారంభించింది. సరిహద్దుల వెంట పాక్ సైనికులు సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు. సరిహద్దు సమీపంలోని పంజాబ్ గ్రామస్థులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాలపై పాక్ మోర్టార్లు, ఫిరంగులతో దాడులకు తెగబడింది. ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాక్ ప్రయోగించిన క్షిపణులను భారత రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. కూలిపోయిన ప్రదేశాల నుంచి క్షిపణుల శకలాలను భారత సైన్యం సేకరిస్తోంది. శకలాలను పరిశీలించిన తరవాత పాక్ ఏ దేశానికి చెందిన ఆయుధాలు ప్రయోగించింది అనే దానిపై స్పష్టత రానుంది.