పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి సోషల్ మీడయా ఖాతాలను బ్లాక్ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి తప్పుడు ప్రచారం చేసినా అలాంటి వారిని గుర్తించి, వారి ఖాతాలు నిలిపివేయాలని హో శాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సందూర్పై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది.
పాక్ ప్రేరేపిత సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఖాతాలను కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది. భారత్లో అలాంటి యూట్యూబ్ ప్రసారాలు నిలిపివేసింది. కొందరు భారతీయులు ఆపరేషన్ సిందూర్ గురించి, పహల్గాం ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలకు కేంద్రం ఆదేశించింది.