పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల శిబిరాలు ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక ఓ జాతీయ సాంకేతిక నిఘా సంస్థ కృషి మరవలేనిది. 2004లో ఏర్పాటు చేసిన నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆపరేషన్ సింధూర్ విజయంలో కీలకంగా వ్యవహరించింది. ఉగ్రవాదుల కదలికలపై ఉపగ్రహాల ద్వారా సమాచారం సేకరించి, భద్రతా దళాలకు ఇవ్వడం ద్వారా ఆపరేషన్ విజయవంతమైంది.
ఎన్టీఆర్వో సంస్థ నేరుగా ప్రధానమంత్రి, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా పనిచేస్తుంది. స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. రా, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సమానమైన నిబంధనలు కలిగి ఉంది. నిఘా వైఫల్యం వల్లే 1999లో కార్గిల్ యుద్దం చేయాల్సి వచ్చిందనే విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ సంస్థకు పురుడుపోసింది.
ఉపగ్రహాలు, అంతర్జాల నిఘా ద్వారా అత్యాధునిక సాంకేతికత ద్వారా ఎన్టీఆర్‌ఐ సమాచారం సేకరిస్తోంది. సంస్థ బలోపేతానికి ప్రత్యేక వనరుల ద్వారా రూ.700 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశారు. రెండు దశాబ్ధాలుగా ఎన్టీఆర్వో కచ్ఛితమైన సమాచారం అందిస్తోంది.