తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెల రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున తిష్టవేశారనే సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. వేలాది బలగాలు అటవీ ప్రాంతాన్నిజల్లెడ పడుతున్నాయి. వెంకటాపురం పరిసర అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలుస్తోంది.