Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

Phaneendra by Phaneendra
May 8, 2025, 08:20 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆపరేషన్ సిందూర్ దాడులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసేసాయన్న సంగతి తెలిసిందే. కానీ అంత మాత్రమే కాదు. మన దేశంలోనే క్రియాశీలంగా పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తుల తప్పుడు కథనాల పునాదులను కదిలించివేసాయి.  ఈ ఆపరేషన్ ఇచ్చిన సందేశం చాలా బిగ్గరగానూ, చాలా స్పష్టంగానూ ఉంది. వర్తమాన పరిస్థితుల్లో ఉగ్రవాదం మనుగడకు స్థలం లేదు. ఆ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే. అయితే, తప్పుడు ప్రచారాలకు ‘ప్రసిద్ధి’ చెందిన చాలా మీడియా సంస్థలు ఈ సంక్లిష్ట సమయంలో సైతం తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాపింపజేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం తమ దేశానికి మద్దతివ్వకుండా, తమ ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నాయి. కేవలం మీడియా సంస్థలే కాదు, తమతమ ఉదారవాద-వామపక్ష-దేశ వ్యతిరేక-హిందూ వ్యతిరేక భావజాలాలు కలిగిన పలువురు వ్యక్తులు కూడా భారతదేశంలో నివసిస్తూనే పాకిస్తాన్ ప్రతినిధుల్లా మాట్లాడుతున్నారు.

 

సందర్భం 1: మే 7వ తేదీన దేశం మొత్తం ఆపరేషన్ సిందూర్ విజయంతో వేడుకలు జరుపుకుంటోంది. ఆ సమయంలో హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక దినపత్రిక ‘ది హిందూ’ తమ ఎక్స్ సామాజిక మాధ్యమ ఖాతాలో ఒక తప్పుదోవ పట్టించే వార్తను ప్రచురించింది. ‘‘జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్, రాంబన్, పాంపోర్ ప్రదేశాల్లో భారతదేశానికి చెందిన కనీసం మూడు జెట్ విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ అధికారి తెలియజేసారు. విజేత అనే జర్నలిస్టు ఈ సమాచారాన్ని తెలియజేసారు’’ అని ఆ వార్త వెల్లడించింది.

అయితే ‘ది స్కిన్ డాక్టర్’ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘ది హిందూ’ ప్రచురించిన వార్తలోని నిజానిజాలను తనిఖీ చేసారు (ఫ్యాక్ట్ చెక్). ‘‘అక్కడ వారు చూపించినది ఫైటర్ జెట్ కాదు. అది ఒక డ్రాప్ ట్యాంక్ మాత్రమే. దాన్నే వింగ్ ట్యాంక్ అని కూడా అంటారు. వాటిని జెట్ విమానాల మీద మోసుకువెడతారు. వాటివల్ల జెట్ విమానాల రేంజ్ పెరుగుతుంది. వాటి అవసరం తీరిపోయాక వాటిని జెట్టీసన్ చేస్తారు, అంటే కింద పడేస్తారు. విమానం బరువును తగ్గించడం లేదా విమాన విన్యాసాల్లో సౌలభ్యం కోసం లేదా తప్పించుకునేటప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అలా పడవేస్తారు’’ అని వివరించారు.

ఆ విధంగా ఫ్యాక్ట్ చెక్ జరిగిన తర్వాత ‘ది హిందూ’ పత్రిక ఆ వివాదాస్పద ఎక్స్ పోస్ట్‌ను తొలగించింది. ఆ విషయాన్ని స్క్రీన్ షాట్‌తో షేర్ చేసిన ‘ది స్కిన్ డాక్టర్’, ‘‘భారతీయ మీడియా, పాకిస్తాన్ తరఫున ఎలాంటి ప్రచారం చేస్తోందో చూడండి. వాళ్ళు కనీసం ధ్రువీకరించుకోవడం లేదు. అది ఉద్దేశపూర్వకమా కాదా అన్నది మీరే నిర్ణయించుకోండి’’ అని ప్రశ్నించారు. ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా హిందూ పత్రిక క్షమాపణ చెప్పలేదు, కనీసం వివరణ అయినా ప్రచురించలేదు అని నెటిజెన్లు తీవ్రంగా విమర్శించారు. దాంతో ఎట్టకేలకు హిందూ పత్రిక యాజమాన్యానికి చురుకు తగిలింది. ఎప్పటికో, తమ వార్త పాఠకుల్లో అయోమయం కలిగించినందుకు చింతిస్తున్నామంటూ నామమాత్రపు క్షమాపణ చెప్పింది.

 

సందర్భం 2: ప్రముఖ హిందూ వ్యతిరేక జర్నలిస్టు రాణా అయ్యూబ్ ‘బ్లూంబెర్గ్’ వెబ్‌సైట్ కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘కశ్మీర్ దాడుల తర్వాత పాక్‌పై భారత్ దాడి, ఐదు భారత విమానాలను పడగొట్టామన్న పాకిస్తాన్, భారతీయ సైనికులను ఖైదీలుగా పట్టుకున్నామన్న పాక్’’ అన్నది ఆ కథనం శీర్షిక. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని, భారత సైనికులు సాఫీగా స్వదేశానికి తిరిగి వచ్చేసారనీ యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంటే రాణా అయ్యూబ్ మాత్రం పాకిస్తాన్ ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది.

అంతేకాదు, ‘ది హిందూ’ డిప్లొమాటిక్ ఎడిటర్ సుహాసినీ హైదర్ చేసిన పోస్ట్‌ను రాణా అయ్యూబ్ రీషేర్ చేసింది. అందులో సుహాసిని ‘‘బహావల్‌పూర్, మురీడ్కే, పీఓకేలోని మరికొన్ని ప్రదేశాల్లో భారతదేశం దాడులు చేసిందని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ధ్రువీకరించారు. వాటికి పాకిస్తాన్ ‘తగిన విధంగా’ స్పందిస్తుందని చెప్పారు’’ అని రాసుకొచ్చింది. పాకిస్తాన్ వాదనపై వారిద్దరికీ ఎంత శ్రద్ధ ఉందో దీన్నిబట్టే తెలుస్తోంది.

 

సందర్భం 3:  ‘వైష్ణా రాయ్’ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసారు. ‘‘ఈ చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది పితృస్వామ్యాన్ని, మహిళలపై యాజమాన్యాన్ని, పరువు హత్యలను, పవిత్రతను, వివాహాన్ని గొప్పగా చూపించడాన్నీ, అలాంటి హిందుత్వ భావజాలానికి చెందిన పెడ పోకడలనూ సూచిస్తోంది’’ అని రాసుకొచ్చింది. ఫ్రంట్‌లైన్ పత్రిక సంపాదకురాలైన వైష్ణా రాయ్ చేసిన ఎక్స్ పోస్ట్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమె తన ప్రొఫైల్ లాక్ చేసుకుంది.  

 

సందర్భం 4: ఏప్రిల్ 22న జరిగిన పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మూడు రోజులకు, అంటే ఏప్రిల్ 25న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక శ్రీనగర్‌కు చెందిన ఒక వార్త ప్రచురించింది. అందులో ‘భారత నియంత్రణలో ఉన్న కశ్మీర్ భాగం’ అని రాసుకొచ్చింది. ఆ విషయాన్ని కంచన్ గుప్తా అనే సామాజిక కార్యకర్త తప్పు పట్టారు. ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పాకిస్తాన్ భావజాలాన్ని మోస్తుండడం దుర్భరంగా ఉంది. భారతదేశంలోని జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఆ పత్రిక ‘భారత నియంత్రణలోని కశ్మీర్’ అనడం దుస్సహం. టైమ్స్ గ్రూప్ సంపాదక బృందం నాయకత్వం దయనీయ పరిస్థితికి ఇది నిదర్శనం’’ అని మండిపడ్డారు.  

దక్కన్ హెరాల్డ్ పత్రిక కూడా అటువంటి తప్పే చేసింది. అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో ప్రచురితమైన వ్యాసాన్ని సిండికేటెడ్ ఆర్టికల్‌గా ప్రచురించింది. కాసేపటి తర్వాత జరిగిన తప్పును గమనించుకుంది. దాంతో చిన్న డిస్‌క్లెయిమర్ తగిలించింది. ‘‘ఈ వ్యాసం ది న్యూయార్క్ టైమ్స్ అందించిన సిండికేటెడ్ వ్యాసం. మా వెబ్‌సైట్‌లో దాన్ని మొదట ప్రచురించినప్పుడు అందులో కశ్మీర్‌ గురించిన ప్రస్తావనలు కొన్ని భారతదేశపు వైఖరిని దృష్టిలో పెట్టుకున్నవి లేవు. వాటిని మా బృందం తరువాత ఎడిట్ చేసింది. సిండికేటెడ్ వ్యాసాల్లో వ్యక్తీకరించే అభిప్రాయాలు దక్కన్ హెరాల్డ్ అభిప్రాయాలు కావు. వాటిని చర్చ కోసం మాత్రమే ప్రచురించడం జరుగుతుంది. భారత సైనిక బలగాల పట్ల దక్కన్ హెరాల్డ్‌కు అమితమైన గౌరవం ఉంది. ధన్యవాదాలు’’ అని చిన్న వివరణ జతపరిచింది.  

అలాగే ‘స్పోర్ట్స్ కీడా’ మాధ్యమం కూడా ఏప్రిల్ 27న జమ్మూకశ్మీర్ గురించి పాకిస్తానీ భాషలో రాసుకొచ్చింది. భారతదేశపు అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌ను ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని వ్యవహరించింది. ప్రధానంగా క్రీడల గురించి ప్రచురించే ఆ డిజిటల్ వార్తామాధ్యమం ఆ దురుద్దేశపూర్వకమైన, వివాదాస్పదమైన ప్రకటనను తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అనే పదబంధాన్ని సాధారణంగా పాకిస్తాన్‌లోని అతివాదులు వాడుతుంటారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను సమర్ధించుకునే క్రమంలో వారు ఆ విధంగా వ్యవహరిస్తారు. ‘స్పోర్ట్స్ కీడా’ కూడా అదే పదబంధాన్ని ఉపయోగించింది.

దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘స్పోర్ట్స్ కీడా’ ఒక క్షమాపణ ప్రకటన చేసింది. ‘‘ఇటీవలి మా పోస్ట్‌లో ఒక తప్పు జరిగినందుకు చింతిస్తున్నాం. అక్కడ మేము కశ్మీర్‌ను తప్పుడు పదంతో ప్రస్తావించాము. అది మావైపు నుంచి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల జరిగిన తప్పు మాత్రమే. దానిద్వారా ఎవరి మనోభావాలను ఐనా బాధించి ఉంటే, ఎవరికైనా నష్టం వాటిల్లి ఉంటే దానికి క్షమాపణలు చెబుతున్నాం. కశ్మీర్ విషయంలో భారతదేశపు సార్వభౌమత్వాన్ని మేము గౌరవిస్తాము. కశ్మీర్ భారతదేశం నుంచి విడదీయరాని అంతర్భాగంగా గుర్తిస్తాము. … … ఆ పోస్ట్‌కు బాధ్యుడైన వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకున్నాము. మమ్మల్ని జవాబుదారీగా ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ క్షమాపణ కోరింది.

 

భారత మీడియా దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానో పొరపాటునో తప్పుడు కథనాలు ప్రచురించడం కొత్తేమీ కాదు. కశ్మీర్ చిత్రపటాన్ని తప్పుగా ప్రచురించిన సందర్భాలు కోకొల్లలు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించడం, జమ్మూకశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా ప్రకటించడం, లద్దాఖ్-గిల్గిట్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించకపోవడం వంటి తప్పులు చేయని పత్రిక లేదా ఛానెల్ లేనే లేదేమో. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, సిఎన్ఎన్, ఆజ్‌తక్, గూగుల్, ట్విట్టర్, ఇంకా ప్రముఖ జర్నలిస్టులు హోస్ట్ చేసే షోలు… అన్నింటిలోనూ ఎన్నోమార్లు ఇలాంటి తప్పులు జరిగాయి. కొన్నిసార్లు తప్పులు ఒప్పుకుని క్షమాపణలు చెప్పినవారు ఉన్నారు, చాలాసార్లు నోరు మెదపకుండా ఉండిపోయిన సందర్భాలే ఉన్నాయి. ఇంక తాజాగా పహల్‌గామ్ దాడి తర్వాత దాన్ని ఉగ్రవాద దాడి కాదు, మతపరమైన దాడి కాదు అంటూ తగ్గించి చూపిన అంతర్జాతీయ మాధ్యమాలకు లెక్కే లేదు.

ఇంక వ్యక్తుల విషయానికి వస్తే… వామపక్ష భావజాలం కలిగినవారు, తమను తాము ఉదారవాదులుగా చెప్పుకునే వారు, జై భీమ్ – జై మీమ్ బ్యాచ్, భారతీయ వ్యతిరేకులు, అగ్రవర్ణాల వివక్ష అంటూ వాదనలు చేసేవారు, జాతీయవాదం అంటే ఒంటికి కారం పూసుకున్నట్లు భావించేవారు, రకరకాల శాస్త్రవేత్తలుగా ప్రచారం చేసుకుంటూ సాహిత్యంలో దిట్టలమని చెప్పుకుంటూ తమ భారతీయ వ్యతిరేక ఉన్మాద భావజాలాన్ని వాంతులు చేసుకునేవారు… ఇలాంటి తెలుగు వారు సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వారంతా పహల్‌గామ్ దాడి నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రతీ పరిణామంలోనూ తమ విషాన్ని కక్కుతూనే ఉన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ పాకిస్తాన్‌కు అండగా నిలుస్తూనే ఉన్నారు. అలాంటి అంతశ్శత్రువుల విషయంలో ఏమరుపాటుగా కాకుండా అప్రమత్తంగా ఉండాలి.

రాజకీయ పక్షంగా బీజేపీ మీదనో, సాంస్కృతిక సంస్థగా ఆర్ఎస్ఎస్ మీదనో ఉన్న వ్యతిరేకత, అక్కసులను దేశానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్న వారు సైతం ఎంతోమంది ఉన్నారు. ఉగ్రవాద దాడి చేసిన ముస్లిములను ముస్లిములుగా చెబితే ఇక్కడ దేశంలో ఉన్న ముస్లిముల మనోభావాలు ఎక్కడ దెబ్బ తింటాయో అని వారికంటె ముందే ఖండఖండాలుగా ఖండించే హిందువులకు మన తెలుగు గడ్డ మీద కొదవ లేదు. పహల్‌గామ్‌లో మతం అడిగి, ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ హత్యలు చేసిన ఉగ్రవాదులకు మతం లేదని వాదించే మహానుభావులే అందరూ. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మూలకారణం మతమే. కానీ ఆ విషయాన్ని ఏ ఒక్క మీడియా సంస్థా ఒప్పుకోదు. కొన్ని రాజకీయ పక్షాలకు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లిములను బుజ్జగించడం అవసరం అంటే కనీసం అర్ధం చేసుకోవచ్చు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రసార మాధ్యమాలకు బుజ్జగింపు రాజకీయాల అవసరం ఏమిటి? హిందువులను ఎన్ని మాటలైనా అనవచ్చు, హిందువులపై ఎన్ని దాడులైనా చేయవచ్చు, కానీ ముస్లిములను మాత్రం పన్నెత్తి మాట అనకూడదు. అన్ని ప్రసార మాధ్యమాలూ అలాంటి బానిస భావజాలం నుంచి బైటపడనివే. తమ జాతి వ్యతిరేక ఉద్దేశాలను ఉదారవాద ముసుగులో దాచిపెట్టేవి కొన్నయితే, గుడ్డి అనుకరణతో ఆ భావజాలపు వరదలో కొట్టుకుపోయేవి మిగిలినవి.

అలాంటి మీడియా సంస్థలు, అటువంటి దేశ వ్యతిరేక భావజాలాలు కలిగిన వ్యక్తులూ ఆపరేష్ సిందూర్ తర్వాత కూడా తమ తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి అసలు ఉద్దేశాలను గ్రహించి అర్ధం చేసుకోవాలి. అప్పుడే వారు సర్వకాల సర్వావస్థల్లోనూ చేస్తున్న కుట్రలు అర్ధమవుతాయి.

Tags: Anti National RhetoricBloombergMedia Propagandaoperation sindoorpahalgam terror attackRana AyyubSuhasini HaiderThe HinduTimes of IndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.