పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ దేశాలు మద్దతు పలికాయి. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంటా 44 నిమిషాలకు భారత వైమానిక దళం పాక్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర శిబిరాలపై భారత్ దాడుల నేపథ్యంలో ప్రపంచ నేతలు స్పందించారు.
భారత్, పాక్ సైనికులు సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలను కోరారు. భారత్, పాక్ మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరు దేశాలు సంయమనం పాటించాలి, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ సలహా ఇచ్చారు.
భారత్, పాక్ దేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇరు దేశాలకు చాలా చరిత్ర ఉందని గుర్తుచేశారు. సాధ్యమైనంద త్వరగా రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోకు వివరించారు.భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబయో సూచించారు.
ఆత్మ రక్షణ కోసం భారత్ దాడులకు దిగిందని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదని ఉగ్రవాదుల నుద్దేశించి అన్నారు. భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.
భారత్, పాక్ రెండూ పొరుగు, దాయాది దేశాలే. పాకిస్థాన్ అన్ని విధాలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఇరు దేశాలు శాంతి, స్థిరత్వంతో వ్యవహరించాలని చైనా సూచించింది. ప్రశాంతంగా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం అంటూ చైనా సందేశం ఇచ్చింది.