ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లో ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేనకు చెందిన యద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ప్రధాని మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ను పర్వవేక్షించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 17 ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన ఒంటి గంట 44 నిమిషాలకు బాంబులు వేసింది. ప్రతిగా పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల వెంట భారీగా కాల్పులకు తెగబడింది. పాక్పై దాడి చేయలేదని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. పలు దేశాల అధినేతలకు ఈ విషయం తెలియజేశారు. అమెరికా రక్షణ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఫోన్లో సంభాషించారు. దాడుల గురించి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. వేలాది మంది పౌరులు చనిపోయారంటూ పాక్ గగ్గోలు పెడుతోంది.