జమ్ము కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గాం దాడి తరవాత బలగాలు జమ్ముకశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి. తాజాగా బుద్గాం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తోన్న బలగాలకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించాయి. ఉగ్రమూకలకు సహాయకారులుగా పని చేస్తున్న వారి నుంచి పిస్తోలు, ఐఈడీ పేలుడు పదార్థాలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తరవాత దాయాది దేశంపై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తాజాగా మే ఏడున అన్ని రాష్టాల్లో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. మే ఏడున మాక్ డ్రిక్ నిర్వహించేందుకు సైరెన్లు మోగించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.