ఇస్కాన్ ప్రచారకర్త, హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబరులో ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించాడనే అభియోగాలపై చిన్మయ్ కృష్ణదాస్‌ను స్థానిక పోలీసుల అరెస్ట్ చేశారు. చిన్మయ్ తరపున వాదనలు వినిపించేందుకు ముందుకు వచ్చిన సైపుల్ ఇస్లాం అలీఫ్‌ను నిరసనకారులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
న్యాయవాది హత్య కేసులో బంగ్లాదేశ్ హైకోర్టు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బంగ్లా పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చిన్మయ్ బెయిల్ రద్దు చేయడంతో ఆయనను మరోసారి బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తరవాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరవాత జరిగిన పరిణామాల్లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు చోటు చేసుకుంది.