ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. మే9న రష్యా విక్టరీ డే జరుపుకుంటున్న వేళ ప్రధాని మోదీ, పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రపోరులో భారత్‌కు అండగా నిలుస్తామన్నారు.
రష్యా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు. భారత్, రష్యా మధ్య ఈ ఏడాది జరగాల్సిన వార్షిక సదస్సు తమ దేశంలో నిర్వహించాలంటూ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారు.
ఏఫ్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి బాధ్యత వహిస్తూప్రకటన చేసింది. గతంలో భారత్ ఈ సంస్థను ఉగ్రజాబితాలో చేర్చింది. ఘటన తరవాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తాజాగా రుణాలు ఆపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకును కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేశారు. ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిషేధించారు. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.