ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ నటుల సినిమాలను భారత్ నిషేధించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్ సినిమాలను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాను భారత్ నిషేధించడం సరైనదిగా అనిపించడం లేదంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. సినిమాను అనుమతిస్తే కావాలో వద్దో జనమే తేలుస్తారంటూ వ్యాఖ్యానించారు.
ముందు సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకులు పాకిస్థానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుందని ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిది అంటూ ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశభద్రత, ప్రజల మనోభావాల కంటే సినిమాల విడుదల ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.