పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం ఇవాళ పరిశీలించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిపుణులు డయాఫ్రం వాల్, రాక్‌ఫిల్ డ్యాం పనులను పరిశీలించారు. పోలవరం నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చిన నిపుణులు జియాన్రాన్కో డి. సికో, రిచర్డ్ డొన్నెల్లి, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. వారి వెంట పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేశ్, అశ్వనీకుమార్ వర్మ ఉన్నారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును ఈ బృందం పరిశీలించింది.ఎగువ కాపర్ డ్యాం డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులను నిపుణులు బృందం పరిశీలించింది. మూడురోజుల పరిశీలన తరవాత నిపుణులు పలు సూచనలు చేయనున్నారు.
ఇవాళ జరగాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేమని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం పరిశీలనకు నిపుణుల బృందం వచ్చిన నేపథ్యంలో బోర్డు సమావేశానికి రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. మే 10 తరవాత త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. బోర్డు సమావేశాలు విజయవాడలో నిర్వహించాలని ఈఎన్సీ బోర్డు అధికారులను కోరారు.