ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులకు శుభవార్త అందించారు.మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కేంద్రం అందించే రూ.6 వేలకు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇస్తుందన్నారు. మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని ప్రకటించారు.
జూన్‌లో పాఠశాలలకు తెరిచే ముందుగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నారు. ఈ రెండు పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లు ఖర్చ చేయనుంది.
జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కానుంది. ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం టీడీపీ నాయకులను ఆదేశించారు. మే 27 నుంచి మూడురోజుల పాటు కడప సమీపంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పార్టీ కమిటీలను నియమించనున్నారు.