అమరావతి రాజదానిలో కుట్రకోణం వెలుగు చూసింది. 2018లో సచివాలయం, ఐకానిక్ టవర్లు, హైకోర్టు నిర్మాణాలకు వేసిన శిలాఫలాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వం పోలీసు విచారణకు ఆదేశించింది. కావాలనే ధ్వంసం చేశారనే విషయం స్పష్టం అవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
చేసిన రెండో రోజే శిలాఫలకాల ధ్వంసంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. శిలాఫలకాల ధ్వంసమైన ప్రదేశాలను పోలీసు అధికారులు పరిశీలించారు. రెండు ప్రాంతాల్లో 2018లో వేసిన శిలాఫలకాల ధ్వంసంపై విచారణ సాగుతోంది. శిలా ఫలాలు నాలుగు దెబ్బతినడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరేళ్లుగా ఆలనాపాలనా లేకపోవడం వల్ల ఊడిపోయాయా? లేదంటే కావాలనే ధ్వంసం చేశారా అనే దానిపై విచారణ సాగుతోంది.