భారత మిలటరీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తోన్న ఇద్దరు సైనికులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు సైనికులు, సైనిక దళాల కదలికల ఫోటోలు తీసి పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు పంజాబ్‌లోని అమృత్‌సర్ పోలీసులు గుర్తించారు. పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్‌లను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని ఇంటెలిజెన్స్ ఆపరేటర్లకు వీరు సమాచారం చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హర్ ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వీరి వద్ద నుంచి చాలా సున్నితమైన కీలక డేటాను స్వాధీనం చేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు. మరికొన్ని అరెస్టులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.