విజయవాడలో ఆదివారం ఉదయం వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో, గంటకుపైగా భారీ వర్షం కురిసింది. నగర రోడ్లు జలమయం అయ్యాయి. పటమట పంటకాలువ రోడ్డు, బందరు రోడ్డు, మొఘల్రాజపురం, కండ్రిగ, సింగ్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. రవాణా స్థంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచివేశారు. వేసవి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన నగర జీవులు భారీ వర్షంతో సేదతీరారు.