అమెరికా శాస్త్రవేత్త మరో ఘనత సాధించారు. పాము కాటు నుంచి అత్యంత రక్షణ కల్పించే యాంటీవెనమ్ మందు కనుగొన్నారు. వందలసార్లు స్వయంగా పాములతో కాట్లు వేయించుకున్న వ్యక్తి దానం చేసిన రక్తం నుంచి ఈ మందును రూపొందించారు. అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన తిమోతీ ఫ్రీడ్‌కు పాముల పట్ల చాలా ఆసక్తి. ఆయన ఇంట్లో వేలాది పాములు పెంచుతున్నారు.
పాము కాటు నుంచి రక్షణ కోసం మొదట్లో స్వల్ప మోతాదులో ఫ్రీడ్ రక్తంలోకి విషం ఎక్కించుకునేవాడు. కొంత కాలం తరవాత నేరుగా పాములతో కాట్లు వేయించుకున్నారు. మొదట్లో కొంత ఆందోళనకు గురిచేసినా తరవాత తనకు అలవాటైందని ఆయన వెల్లడించారు. 18 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 856 సార్లు పాము కాట్లు వేయించుకోవడం, రక్తంలోకి విషం ఎక్కించుకోవడం చేశాడు. వీటిలో 16 రకాల అతి ప్రమాదకర పాము జాతులు కూడా ఉన్నాయి.
తిమోతీ శరీరం యాంటీబాడీలను వృద్ధి చేసింది. తిమోతీ దానం చేసిన రక్తంతో సెంటీవ్యాక్స్ అనే సంస్థ యాంటీవెనమ్‌ను రూపొందించింది. తమోతీ నుంచి సేకరించిన రక్తంలోని యాంటీబాడీలతోపాటు, వారెస్టిటిజ్ అనే పదార్థం ఉపయోగించారు.