మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని మోదీ బేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన అంగోలా అధ్యక్షుడు జువా భారత్‌పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదం మానవాళికి పొంచిఉన్న అతిపెద్ద ముప్పని అంగోలా అధ్యక్షుడు అన్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తోన్న పోరాటానికి అంగోలా అధ్యక్షుడు మద్దతు పలికారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదం, అలాంటి వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని అంగోలా ప్రధాని జువా స్పష్టం చేశారు.