బుగ్గమఠం భూముల ఆక్రమణలు తేల్చేందుకు రెవెన్యూ అధికారులు తిరుపతిలో సర్వే ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోవర్ సాయంతో భూముల సర్వే జరుగుతోంది. జిల్లా భూముల సర్వేయర్ చిట్టిబాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి సర్వే చేపట్టారు. గత నెల 11న సర్వే జరగాల్సి ఉండగా 16వ ఆర్థిక సంఘం పర్యటన ఉండటంతో వాయిదా వేశారు.
వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి ఈ భూముల ఆక్రమణలపై అధికారులు ఇప్పటికే నోటీసులు అందించారు. 261/1,2 సర్వే నెంబర్లలో 3.88 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఆక్రమిత భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. తన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆ భూములు కొనుగోలు చేశాడని అధికారులకు సమాచారం అందించారు.