జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటన కేసు దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ తాజాగా రాజౌరిలో రెండేళ్ల కిందట ఉగ్రదాడికిపాల్పడిన వారిని జైల్లో విచారిస్తోంది. రాజౌరిలో ఉగ్రదాడి చేసి ఐదుగురు పౌరులను చంపిన కేసులో ఇద్దరిని ఎన్ఐఏ గతంలోనే అరెస్ట్ చేసింది. ప్రస్తుత దాడికి వారికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ అత్యాధునిక సాంకేతికతతో త్రీడీ విజువల్స్ రూపొందిస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలో 40 బులెట్ సెల్స్ స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటి వరకు 2500 మందిని విచారించారు. పర్యాటకులు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గుర్రాలను తోలే పోనీవాలాలను ప్రశ్నిస్తున్నారు.