అమరావతి రాజధాని పున:నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 49 వేల కోట్ల విలువై అమరావతి పనులతోపాటు, కేంద్ర పథకాలను ప్రారంభించారు. 57 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభంచారు. అమరావతి పుణ్యభూమిపై నిలబడినప్పుడు నాకు ఒక రాజధాని మాత్రమే కాదు, నా కల నిజమౌతుంది. సాంప్రదాయాలకు నిలయం అమరావతి. ఆంధ్రప్రదేశ్ ఆశలకు, భారత భవిష్యత్తుకు అమరావతి అండగా నిలవనుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి రాజధాని నిర్మాణం శుభ సూచితం అని మోదీ అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు. అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్న ఆధునిక ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ,క్లీన్ ఇండస్ట్రీ, ఇంకా అనేక రంగాలకు అమరావతి కేంద్రంగా నిలుస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నేను మీ అందరికీ ఒక రహస్యం చెబుతాను, హైదరాబాదులో ఐటీని చంద్రబాబునాయుడు ఎలా అభవృద్ధి చేశారో నాడు గుజరాత్ సీఎంగా ఉండగా పరిశీలించానన్నారు. నా అనుభవంతో చెబుతున్నాను. పెద్ద ప్రాజక్టులు, నాణ్యతతో పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యమని మోదీ కితాబిచ్చారు. ఎన్టీఆర్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోస కలలు కన్నారు. ఇప్పడు మనం అమరావతిని అభవృద్ధి చేయాలి. ఇది మనమే చేయాలని మోదీ తెలుగులో స్పష్టం చేశారు.
గత పదేళ్లలో భారత్ డిజిటల్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. ఇది ఏపీకి చాలా ఉపయోగపడనుంది. ఏపీలో అనేక రైల్వే, రోడ్డు ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించాం.ఏపీలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే కనెక్టివిటీ పెరుగుతుంది. రైతులు పెద్ద మార్కెట్లకు పంటను త్వరగా తీసుకెళ్ల గలుగుతారు. ఉద్యోగులు, పర్యాటకులకు కూడా మేలు జరుగుతుంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు రైల్వేలు అభివృద్ధి చేసుకున్నాయి. మనం కూడా రైల్వేల అభివృద్ధిపై దృష్టి సారించాం. కేవలం ఏపీకే 9 వేల కోట్లు రైల్వేలకు అందిస్తున్నామని ప్రధాని చెప్పారు. పదిరెట్లు రైల్వేకు నిధులు పెంచామన్నారు.
భారీ స్థాయిలో అభివృద్ధి జరగడం వల్ల అనేక పరిశ్రమలకు ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం రైతులు, పేదవారు, మహిళలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని నిర్ణయించుకున్నాం. పదేళ్లలో రైతులకు 12 లక్షల కోట్ల ఎరువుల రాయితీ అందించామని ప్రధాని చెప్పారు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ రైతులకు 17 వేల కోట్లు అందించినట్లు గుర్తుచేశారు.
ప్రతి పొలానికి నీరు అందించడం మా లక్ష్యం. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరవాత పోలవరం పనులు పరుగులు తీస్తున్నాయని ప్రధాని తెలిపారు. దేశ రక్షణను బలోపేతం చేసే మిసైల్ పరీక్షా కేంద్రాన్ని నాగాయలంకలో ప్రారంభించినట్లు ప్రధాని ప్రకటించారు.
అమరావతి రాజధానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, ఓ వ్యక్తి అధికారంలోకి వచ్చి విధ్వంసం చేశాడని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని చరిత్రలో చూడలేదన్నారు. ఉద్యమకారులకు సెల్యూట్ చేశారు. 2024లో ప్రజా తీర్పుతో అమరావతి ఊపిరిపోసుకుందన్నారు. పది మాసాల్లో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. అమరావతి రాజధాని 5 కోట్ల మంది ప్రజల ఆశాజ్యోతని సీఎం గుర్తుచేశారు. ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణం చేస్తామన్నారు. నా రాజధాని అమరావతి అంటూ ప్రజలతో సీఎం నినాదాలు చేయించారు. ఒకే రోజు 49 వేల కోట్ల రాజధాని పనులకు, మరో 57 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాజధానిలో 30 శాతం పచ్చదనం ఉంటుందన్నారు. నవ నగరాలు ఉంటాయని గుర్తుచేశారు. ప్రధాని మోదీ సలహాతో భావితరాలకు ప్రపంచం మెచ్చే నగరంగా తయారు చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
అమరావతికి అవుటర్, ఇన్నర్ రింగు రోడ్డుతోపాటు, అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందన్నారు. 5 లక్షల మంది రాజధానిలో చదువుకునేలా విద్యా సంస్థలను తీసుకువస్తున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో అమరావతి మొదటి స్థానంలో నిలుపుతామని చంద్రబాబు చెప్పారు. కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా రాజధాని ఉంటుందని సీఎం చెప్పారు. బిట్స్ పిలాని, ఎక్స్ఎల్ఆర్ బిజినెస్ స్కూల్,టాటా స్టార్పప్ కేంద్ర రాబోతోందన్నారు.