తెలంగాణలో గొర్రెల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేటలో మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంటుతో సోదాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. మొయినుద్దీన్ బ్యాంకు ఖాతా నుంచి ఆయన భార్య ఖాతాను పెద్ద ఎత్తున నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. రెండు కార్లు సీజ్ చేశారు.
గొర్రెల కుంభకోణంలో మరో కీలక వ్యక్తి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. అప్పటి పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది.
ఈ కుంభకోణంలో రూ.700 కోట్లు అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పశుసంవర్ధక శాఖకు చెందిన పది మంది అధికారులను అరెస్ట్ చేశారు.