జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. కేంద్రం వసూలు చేస్తోన్న వస్తు సేవల పన్ను జీఎస్టీ ఏప్రిల్ మాసంలో 2.37 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇది. రూ.2.10 లక్షలుగా ఉంది. తాజాగా సరికొత్త రికార్డు నమోదైంది. 2017 జులై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత పెద్ద మొత్తం వసూలు కావడం ఇదే మొదటిసారి .
గత ఏడాది ఏప్రిల్ కన్నా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 12.6 శాతం పెరిగాయి.మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లు, ఏప్రిల్ మాసంలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 10.7 శాతం పెరిగింది. దిగుమతులపై వసూలు చేసే జీఎస్టీ ఆదాయం 20.8 శాతం మేర పెరిగి రూ.46,913కు పెరిగింది. రూ.27341 కోట్ల రిఫండ్లు జారీ చేశారు. అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రూ.2.09 లక్షలు వసూళ్లు జరిగాయి.