అమరావతి రాజధాని పున:నిర్మాణ పనుల శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పున: నిర్మాణానికి వెలగపూడిలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాజధానిలో పర్యటించిన మంత్రులు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు.
అమరావతి రాజధాని పున: నిర్మాణానికి ప్రధాని మోదీ రేపు సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు రానున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. 6 లక్షల మందికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ స్పష్టంచేశారు.