బంగారం ధర దిగివచ్చింది. గురువారం 10 గ్రాముల బంగార ధర ఒకేసారి రూ.2300 తగ్గింది. తాజాగా దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.95730 వద్ద ట్రేడవుతోంది. గడచిన వారంలోనే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.5 వేలు తగ్గి 95730కి దిగివచ్చింది. 22 క్యారెట్ల పది గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ రూ.87350 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా దిగివచ్చింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ.99990 వద్ద ట్రేడవుతోంది.
బంగారం, వెండి ధరలు దిగి రావడంతో వినియోగదారులు మరో సారి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే బంగారం కొనుగోళ్లు 15 శాతం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర రికార్డు స్థాయి నుంచి దిగి వచ్చింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం తాజాగా 3276 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.