సింహాచలం మల్లన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శిచుకునేందుకు వేలాది భక్తులు ఒకే ముందుకు వచ్చారు. దీంతో గోడ కూలి ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి తరవాత విశాఖ సమీపంలో సింహాచలం దేవస్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింహగిరి బస్టాండు సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూలైను గోడ కూలి ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. విషయం తెలియగానే హోం మంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.