తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మంగళంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణం జరుగుతోన్న ఐదంతస్తుల భవనం పై నుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గరు మేస్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తుడా క్వార్టర్స్ ప్లాట్ నెంబరు 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య అనే వ్యక్తి ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. ఈ పనులు చేసేందుకు పెళ్లకూరు మండలంలోని అక్కగారిపేటకు చెందిన బి. శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంత్, కె. శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ్ పనిచేస్తున్నారు. ఐదో అంతస్తులో పనులు చేస్తుండగా కర్రలు ఒక్కసారిగా ఊడి ముగ్గురు మేస్త్రీలు కింద పడి మరణించారు. మాధవ్ ఒక్కరే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ప్రమాదం జరగాన్నే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన ముగ్గురు మేస్తీల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.