కెనడాలో దారుణం చోటు చేసుకుంది. ఆప్ సీనియర్ నేత కుమార్తె వంశిక అనుమానాస్పదంగా చనిపోయారు. ఆమె మరణాన్ని కెనడా ప్రభుత్వం ధ్రువీకరించింది. వంశిక కుటుంబ సభ్యుల ద్వారా అందిన సమాచారం మేరకు.
పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ కుమార్తె వంశిక నాలుగు రోజుల కిందట కెనడాలోని ఓ బీచ్‌లో అనుమానాస్పదంగా మరణించారు. ఈ విషయాన్ని కెనడా అధికారులు ధ్రువీకరించారు. ఏప్రిల్ 25న వంశిక అద్దె ఇంటిని వెతికేందుకు వెళ్లారని తెలుస్తోంది. ప్రతి రోజూ పంజాబ్‌లోని కుటుంబ సభ్యులతో మాట్లాడే వంశిక ఫోన్ ఏప్రిల్ 25న పని చేయకపోవడంతో ఆందోళన చెంది కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు వంశిక ఓ బీచ్‌లో చనిపోయినట్లు గుర్తించారు. కెనడాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు విషయం వెల్లడించారు. వంశిక అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
కెనడాలో ఇటీవల హర్ సిమ్రత్పై దుండగులు కాల్పులు జరిపి చంపివేశారు. ఈ ఘటన మరవకముందే మరో యువతి అనుమానాస్పదంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.