ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కెజిఎంయు)లో కొంతమంది ముస్లిములు రహస్యంగా అక్రమంగా మజార్లు నిర్మించసాగారు. ఆ పేరిట ముస్లిములు మెడికల్ వర్సిటీ భూములను ఆక్రమించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను కొందరు వైద్యులు వ్యతిరేకించారు. ముస్లిం ఆక్రమణదారులు నిస్సిగ్గుగా ఆ వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. విషయం బైటకు తెలిసిన 24గంటలలోపే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వపు బుల్డోజర్లు రంగం లోకి ప్రవేశించాయి. నిన్న సోమవారం నాడు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసాయి.
లఖ్‌నవూలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ. గత కొన్ని నెలలుగా కేజీఎంయూ ఆవరణలోని ఖాళీ స్థలాల్లో కొంతమంది వ్యక్తులు రహస్యంగా మజార్లు నిర్మించడం మొదలు పెట్టారని స్థానికులు వివరించారు. అనధికారికంగా నిర్మించడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, కళాశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలు చేపట్టడం అక్రమం మాత్రమే కాదు, అక్కడ భద్రతా ప్రమాణాల విషయంలో ఆందోళన కలగజేస్తోంది. అన్ని మతాలు, అన్ని రకాల నేపథ్యాల నుంచి వచ్చే వారితో సందడిగా ఉండే ఆసుపత్రులు అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందుబాటులో ఉంచాలి, అందరి పట్లా తటస్థంగా ఉండాలి. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉండడం ఆందోళనకరంగా మారింది.
ఆస్పత్రి ఆవరణలో పెరుగుతున్న అక్రమ ఇస్లామిక్ నిర్మాణాలను గమనించిన వైద్యులు, ఇతర సిబ్బంది తొలుత ఆందోళన వ్యక్తం చేసారు. ఆ అక్రమ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. దానికి ప్రతిగా వారికే బెదిరింపులు వచ్చాయి. కొందరు దుండగులు ఆదివారం నాడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడ్డారు.
ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో అనధికారికంగా మత నిర్మాణాలు చేపట్టడం, అడ్డుకోడానికి ప్రయత్నించిన వైద్యులనే చితకబాదడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలూ క్షణాల్లో వైరల్ ఐపోయాయి. దాంతో యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ సంఘటన జాతీయ స్థాయిలో కూడా బాగా ప్రచారం పొందింది. పౌర సమాజానికి చెందిన పలు వర్గాలు, రాజకీయ నాయకులూ వైద్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ సంఘటనకు బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.
సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, పోలీస్ అధికారుల సహాయంతో సోమవారం ఉదయం వర్సిటీ ఆవరణలోకి చేరుకున్నారు. యోగి మార్కు బుల్డోజర్లు రంగప్రవేశం చేసాయి. కొన్ని క్షణాల్లోనే అక్రమ మజార్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలను కూడా వెంటనే తీసివేసారు. ఆ ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసారు. ఎలాంటి అల్లర్లూ జరక్కుండా, అక్రమ ఆక్రమణల ప్రయత్నాలు జరగకుండా నివారించేందుకు కేజీఎంయూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.
వైద్య వర్సిటీ ఆవరణలో మజార్లను అక్రమంగా నిర్మించడం, వ్యతిరేకించిన ఉపాధ్యాయులపై భౌతిక దాడికి పాల్పడడంలో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరి మీదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూపీ అధికారులు స్థానికులకు హామీ ఇచ్చారు. నేరాలు, ఆక్రమణల విషయంలో ఏమాత్రం సహనం చూపకుండా జీరో టాలరెన్స్ వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ నమూనాలో, ఎంజీకేయూలో బుల్డోజర్లను ప్రయోగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.