జమ్మూకశ్మీర్ విహారయాత్రకు వెళ్ళి పహల్గాం వద్ద ముస్లిముల ఉగ్రవాదుల కిరాతక చర్యలో ప్రాణాలు కోల్పోయిన, కావలికి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ నేతలు ఏప్రిల్ 28 సోమవారం, అంటే ఇవాళ వారి ఇంటిలో పరామర్శించారు..ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలియజేసారు.
ఆ సందర్భంగా మృతుడు మధుసూదన్ భార్య పద్మావతి మాట్లాడుతూ… కాశ్మీర్లో జరిగిన సంఘటన తమ కుటుంబానికి నష్టం కలిగించినా, ముస్లిం ఉగ్రవాదులు మతం పేరుతో మారణహోమానికి పాల్పడడం క్షమించరాని నేరమని అన్నారు. స్థానిక వ్యాపారులు కొందరు పర్యాటకులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా కశ్మీర్లో శాంతి ఏర్పడి, పర్యాటకులు వస్తున్నారని ఆమె చెప్పారు. ఆ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికే ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపేసారని ఆవేదన వ్యక్తం చేసారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత సంఘ్ చాలక్ హరికుమార్ రెడ్డి, ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు, నెల్లూరు విభాగ్ సంఘ్ చాలక్ పల్నాటి రామదండు విభాగ్ కార్యకారిణి సభ్యులు బాలు సుబ్బారావు, స్థానిక నేతలు మురళి, నగేష్ బాబు తదితరులు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు