జమ్ముకశ్మీర్ బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూక కోసం సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉగ్రవాదులు చాలా చాకచక్యంగా నాలుగు ప్రాంతాల్లో తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని తెహస్లీ, కుల్గాం, త్రాల్, కొకెర్నాగ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారని ఓ ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది. అడవులు దట్టంగా ఉండటంతో ఉగ్రవాదులను నిర్ధారించుకునే లోపే కాల్పులు జరుపుతూ పారిపోతున్నారని ఆంగ్ల మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఉగ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, నిత్యావసరాల కోసం వెంపర్లాడుతున్నారని సైన్యం గుర్తించింది. గ్రామాల నుంచి సమీప అటవీ ప్రాంతాలకు ఆహారం తెప్పించుకుంటారని సైన్యం నిఘా వేసింది. అయితే ఉగ్రవాదులు మాత్రం అత్యంత చాకచక్యంగా ఎప్పటి కప్పుడు తప్పించుకుంటూ సైన్యాన్ని ఏమారుస్తున్నారని తెలుస్తోంది. నలుగురు ఉగ్రవాదుల లొకేషన్లు నాలుగు సార్లు గుర్తించినా వారిని ఎన్కౌంటర్ చేసే లోపే వారు అడవుల్లోకి పారిపోతున్నారని కథనాల ద్వారా తెలుస్తోంది.
బైసరన్ లోయ సమీప కొండల్లో మంచు కూడా తక్కువగా ఉండటంతో వారు శ్రీనగర్‌లోకి ప్రవేశించే అవకాశాలపై కూడా నిఘా వేశారు. పర్యాటకుల నుంచి ఉగ్రమూకలు రెండు సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. వాటితో వారు మాట్లాడే అవకాశం ఉండటంతో టెక్నికల్ టీం రంగంలోకి దిగింది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు