అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్, భారతీయుల వీసాలు నిలిపివేసిందంటూ కథనం ప్రసారం చేయడంతోపాటు, ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేయడంపై బీబీసీకి కేంద్రం లేఖ రాసింది.బీబీసీ ప్రసారాలపై నిఘా ఉంచుతామంటూ లేఖలో హెచ్చరించింది.
పహల్గం ఉగ్రదాడి వార్తల ప్రసారాల్లో బీబీసీ కథనాలపై సోషల్ మీడయాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేయడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీనిపై కేంద్రం కన్నెర్ర చేసింది.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయగా పలు దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఉగ్రదాడిని ఖండించాయి. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేసిన బీబీసీ కథనాలపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మీడియా సంస్థ దిద్దుబాటుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు