పాకిస్థాన్ మహిళ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చూడటానికి పాక్ వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి ఏడేళ్ల వయసు సమయంలో భారత్ చేరుకుంది. ఆమె బిడ్డకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చాయి. అయినా పాక్ పౌరురాలిగానే కొనసాగుతోంది. రెండేళ్ల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు తిరస్కరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ధర్మవరానికి చెందిన పాక్ పౌరురాలి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
బళ్లారి ప్రాంతానికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాక్ వెళ్లిపోయాడు. అక్కడే ఆయనకు నలుగురు సంతానం కలిగారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్‌ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫిక్ అహ్మద్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు మొదట కుమారుడు జన్మించాడు. 1998లో జీనత్ గర్భవతిగా ఉన్న సమయంలో పాక్‌లోని తండ్రి ఆరోగ్యం క్షీణించిందని సమాచారం రావడంతో ఆమె వెళ్లారు. ఆ సమయంలో కార్గిల్ యుద్ధం మొదలు కావడంతో సరిహద్దులు మూసివేశారు. అప్పుడే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. యద్ధం ముగిసిన తరవాత ఏడేళ్లకు భారత్ చేరుకుంది. అక్కడ పుట్టిన బిడ్డకు పాక్ పౌరసత్వం లభించింది. ధర్మవరం వచ్చి 26 సంవత్సరాలు అవుతున్నా జీనత్ కుమార్తెకు భారత పౌరసత్వం లభించలేదు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు